శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (11:03 IST)

హల్లో దేవగౌడాజీ హ్యాపీ బర్త్‌డే.. మీకోసం దేవుడుని ప్రార్థిస్తున్నా : మోడీ ట్వీట్

తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక

తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఫోన్‌ చేసిన విషయాన్ని దేవెగౌడ తనయుడు రేవణ్ణ ధృవీకరించారు.
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి... దేవెగౌడ ఆరోగ్యం, ఆయుష్షు కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 'నేను మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కలిగుండాలని ప్రార్థిస్తున్నా' అని మోడీ ట్వీట్ చేశారు.