గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (21:21 IST)

స్నానం చేస్తున్న మహిళ... భర్త ముందే ఆమె చేయి పట్టుకుని లాగిన పోలీస్...

అడ్డదారి తొక్కుతున్న ఆకతాయిలకు బుద్ధి చెప్పాల్సిన పోలీసే అసభ్యంగా ప్రవర్తిస్తే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి. ఇలాంటి ఘటన గోవా బీచ్‌లో జరిగింది. భర్త పిల్లలతో సరదాగా గడపడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, దుషించాడు. 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్‌వీర్ ప్రభుదయాల్ సింగ్ అనే 43 ఏళ్ల వ్యక్తి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)లో కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం కలంగుటే బీచ్‌కి వెళ్లిన రాజ్‌వీర్ కన్ను అక్కడ భర్తా పిల్లలతో కలిసి స్నానం చేస్తున్న మహిళపై పడింది. వెంటనే యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. 
 
అతని ప్రవర్తన చూసి భయపడిన ఆమె అతడిని మందలించింది. అంతటితో రెచ్చిపోయిన రాజ్‌వీర్ ఆమెను బండబూతులు తిట్టాడు. అడ్డు వచ్చిన భర్తను చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆమె భర్తతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌పై వారు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఫోర్స్ రిక్రూట్ ట్రెయినింగ్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాజ్‌వీర్‌పై ఆరోపణలు నిరూపితమైతే అతని ఉద్యోగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.