ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (12:22 IST)

కోయంబత్తూరులో పేలిన సిలిండర్.. పోలీస్ అధికారి మృతి

blast
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ పోలీస్ అధికారితో పాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నైలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శబరినాథ్‌తోపాటు మరో మహిళ పొల్లాచి సమీపంలోని నల్లూర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. గురువారం అనుకోకుండా ఇంట్లోని ఫ్రిజ్‌ ఒక్కసారిగా పేలిపోయింది. అంతలోనే మంటలు అంటుకున్నాయి. 
 
దీంతో వాళ్లిద్దరూ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మంటలను అదుపు చేసి, మృతదేహాలను వెలికి తీసి.. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.