బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (17:24 IST)

కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ఆపాలి- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. జమ్మూలో శాంతి నెలకొల్పేందుకు రాజకీయపరమైన కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సైనిక బలగాలు కొత్త

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. జమ్మూలో శాంతి నెలకొల్పేందుకు రాజకీయపరమైన కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సైనిక బలగాలు కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

సరిహద్దులకు అవతలి వైపు ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేశారని పాకిస్థాన్‌ వెన్నులో దడ పుట్టించాలని.. భారత్ అంటేనే పాక్‌కు వణుకు పుట్టాలని బిపిన్ తెలిపారు. 
 
అది జరగాలంటే... పొలిటికో-మిలిటరీ వైఖరిని అనుసరించాల్సి వుంటుందని తెలిపారు. ఉగ్రవాదుల పనిపట్టడం, తీవ్రవాదుల పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరగకుండా చూడటమే తమ పని అంటూ రావత్ వ్యాఖ్యానించారు. రాజకీయ కార్యాచరణకు ఇతర కార్యాచరణలు తోడైతే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కరణలో మిలటరీ ఓ భాగమేనని రావత్ గుర్తు చేశారు. 
 
ఇదిలా ఉంటే.. తమ పాలకులు అనుమతిస్తే భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ సంచలన ప్రకటన చేశారు. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాకిస్థాన్‌పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఖ్వాజా తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. ట్వీట్ చేశారు. భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని ఆరోపించారు.