Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజినీకాంత్ సీఎం అయితే ఇక వాళ్లు పడుకునే ప్రణామాలా?

బుధవారం, 10 జనవరి 2018 (12:36 IST)

Widgets Magazine
Rajinikanth

ఏదైనా ఎక్కువగా తొక్కిపెడితే అది రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందనడానికి నిదర్శనంగా తమిళనాడును చెప్పుకోవచ్చనేది నిర్వివాదాంశం. ఏ ఒక్కరికీ... చివరికి కేంద్ర ప్రభుత్వానికైనా దాసోహమనే ఆలోచన రానివ్వకూడదంటూ నినదించి, అందులో భాగంగానే చివరికి జాతీయభాష హిందీని కూడా తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ ప్రజలు చివరికి వ్యక్తి పూజల ఊబిలో దిగిపోయి అందులోనే మునిగితేలుతున్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
 
నిన్నమొన్నటి వరకు సినిమా హీరోయిన్లకు గుళ్లు కట్టించిన తమిళ తంబీలు ఒక ఎత్తైతే... దివంగత నేత పురచ్చితలైవి అమ్మగారికి.. సీనియర్ మంత్రులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం సాగిలపడి దండప్రమాణాలు చేస్తూ... తమకు ఓటేసిన తంబీలకంటే తామే రెండాకులు ఎక్కువ చదివామనిపించారు.
 
కానీ, ఏదో మార్పు తెస్తారంటూ.. అందరూ ఎదురుచూస్తున్న తలైవాగారి రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ఒక వీడియోలో అభిమానులు ఆయనకు ప్రదక్షిణలు చేస్తూండటం చూస్తూంటే... ఇప్పుడే ఇలాగుంటే మరి ఆయనగారు పదవిలోకి వచ్చిన తర్వాత అసలు నేలపై నిలబడతారా అనే సందేహం కలిగిస్తోంది.
 
ఈ వ్యక్తిపూజల ఊబి నుండి తమిళ తంబీలను బయటపడేసేందుకు ఏ దేవుడో వచ్చి గజేంద్రమోక్షం కలిగించవలసి ఉంటుందేమో మరి.. చూద్దాం.. వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడో అంతస్థులో చిక్కుకున్న మహిళ.. ఓ వ్యక్తి ఎలా కాపాడంటే? (వీడియో)

చైనాలోని హెనాన్ ప్రాంతంలో మూడో అంతస్తులో ఏర్పడిన మంటల్లో ఓ గర్భిణీ మహిళ చిక్కుకున్నారు. ...

news

హైదరాబాదులో యువతి దారుణ హత్య: ప్రేమోన్మాదే చంపేశాడా?

హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన ...

news

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం..

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ ...

news

జామకాయ ఓ బాలుడి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

ఓ జామకాయ ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తొడపై జామకాయ పెట్టి కోయాలనుకున్న విద్యార్థి మృతి ...

Widgets Magazine