శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2018 (15:19 IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీలోకి నటి రాధిక, విశాల్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేసిన తరువాత వరుసగా కొంతమంది సినీప్రముఖులు ఆయన పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే రాఘవ లారెన్స్ రజినీ పార్టీలోకి వెళ్ళేందుకు సిద్థంగా ఉండటమే కాకుండా రజినీ అల్లుడు ధనుష్‌‌తో

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేసిన తరువాత వరుసగా కొంతమంది సినీప్రముఖులు ఆయన పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే రాఘవ లారెన్స్ రజినీ పార్టీలోకి వెళ్ళేందుకు సిద్థంగా ఉండటమే కాకుండా రజినీ అల్లుడు ధనుష్‌‌తో సంప్రదింపులు కూడా జరుపారు. ఇప్పుడు తాజాగా నటి రాధిక, నటుడు విశాల్‌లు ఆయన పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. 
 
రాధిక పార్టీలోకి వెళ్ళడమే కాదు ఎంపీగా కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందన్న ఆలోచనలో ఆమె వున్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు విశాల్ రజినీ పార్టీకి మద్ధతు మాత్రమే తెలిపి రజినీ పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇలా ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు రజినీకాంత్ పార్టీలోకి వెళ్ళేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు రజినీ పార్టీ పేరునే ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ పేరును, గుర్తును ప్రకటిస్తానని ఇప్పటికే రజినీకాంత్ ప్రకటించారు.