శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 6 జనవరి 2018 (19:36 IST)

రజినీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా... కమల్ కూడా చేరిపోతారా?

తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత వరుసగా ఆ పార్టీలోకి క్యూ కట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా తాము రజినీ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు కూడా. ఇంతవరకు పార్టీ గుర్తు కానీ, పార్ట పేరు ప్రకటించకున్నా

తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత వరుసగా ఆ పార్టీలోకి క్యూ కట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా తాము రజినీ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు కూడా. ఇంతవరకు పార్టీ గుర్తు కానీ, పార్ట పేరు ప్రకటించకున్నా సినీ పరిశ్రమలోని వారు మాత్రం చాలామంది రజినీ పార్టీవైపు వెళ్ళేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం సంతోషించదగ్గ విషయం. ఆయన ప్రకటన తరువాత నాకు చాలా సంతోషంగా ఉంది. రజినీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది సరైన సమయమని చెప్పారు కమల్ హాసన్. అంతటితో ఆగలేదు. రజినీ తన ప్రకటన తరువాత నన్ను పిలవలేదు. ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు కమల్ హాసన్. పిలుపు అంటే ఆయన పార్టీలోకి వెళ్ళడమా లేకుంటే ఇంకేదైనా దృష్టిలో పెట్టుకుని కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటికే కమల్ హాసన్ పైన ఆర్కే నగర్ పోలీస్టేషనులో కేసు నమోదైంది. ఉప ఎన్నికల్లో డబ్బులు పంచడం వల్లే దినకరన్ గెలిచాడంటూ కమల్ ప్రకటన చేయడంతో దినకరన్ వర్గీయులు కమల్ పైన పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసులకు తాను భయపడనని, చట్టపరంగానే ముందుకు వెళతానంటున్నారు కమల్ హాసన్.