శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (12:17 IST)

మన ఇళ్లలో కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోవిడ్-19 పేరు వింటేనే భయపడే పరిస్థితులివి. రెండువారాల క్రితం వరకూ మనదేశంలో వైరస్ తగ్గుముఖం పడుతోందన్న భావన ఉండేది. లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం అంతా ఒక్కసారిగా బయటకురావడంతో కేసుల సంఖ్య అమాంతం పెరిపోతోంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. కానీ మనం ఏదో ఒక సమయంలో కిరాణా షాపు లేదా మెడికల్ షాపులకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

మరికొన్నిసార్లు కూరగాయల కోసం మార్కెట్లకు వెళ్లి పని ముగించుకుని తిరిగి వచ్చాక మీరు వైరస్ ను మీతో ఇంటికి తీసుకురాలేదని నిర్ధారించుకోవడానికి ఈ క్రింది సూచనలు పాటించారో లేదో ఒక సారి చెక్ చేసుకోండి. బయట పనులకు గాను ఒక ప్రణాళిక తయారు చేసుకోండి
 
మీ పనులకు గాను బయట తిరగవలసిన సందర్భాలను చాలావరకు పరిమితం చేసుకోండి
• అత్యవసర సందర్భాల్లో మనము బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినపుడు
ఇతరులకు మీకు మధ్య కనీసం ఆరు అడుగుల ఉండేట్లు చూసుకోండి 
షాపింగ్ చేసేటప్పుడు బండ్లు లేదా బుట్టలకు ఉన్న హ్యాండిల్స్ తుడవడం చేయకండి
వీలైనంత వరకూ చేతి తొడుగులు మరియు ముఖానికి ముసుగు వాడండి
మీరు బయటికి వచ్చినప్పుడు తరచుగా చేతులు కడుక్కోండి మరియు మీ ముఖాన్ని తాకకుండా ఉండండి 
బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీ చేతులను సబ్బు మరియు నీటితో 20 సెకన్ల పాటు కడగండి
మీరు బయట తీసుకెళ్లే బాక్సులను మరియు ప్యాక్ చేసిన ఆహారాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి శానిటైజ్ చేయండి.
మీరు బయట నుండి తీసుకు వచ్చిన ఉత్పత్తులను వంటగదిలో ఉంచే ముందు వాటిని బాగా కడగాలి 
 
వైరస్  రహితముగా చేసుకోవడం: 
మీరు తాకిన ప్రతిదాన్ని అనగా డోర్క్నోబ్లు, లైట్ స్విచ్లు, కీలు, ఫోన్, కీబోర్డులు, రిమోట్లు మొదలైనవి శానిటైజ్ చేయండి.
EPA- ఆమోదించిన క్రిమిసంహారక మందులను వాడండి (వీటిలో క్లోరోక్స్ క్రిమిసంహారక గ్లవుజులు మరియు కొన్ని లైసోల్ స్ప్రేలు ఉన్నాయి) మరియు ఉపరితలాలు 3-5 నిమిషాలు తడిగా ఉంచండి. 
 
మనకు  ఇతర ప్రదేశం నుంచి వచ్చిన వస్తువుల డెలివరీ విషయంలో..
మీ ఇంటి గుమ్మంలో లేదా మీ కాంప్లెక్స్  ప్రాంతంలో డెలివరీలను వదిలివేయమని అడగండి.
చెల్లింపులకు గాను మీ వద్దకు రావాలంటే వారిని మీ తలుపులకు 6 అడుగుల దూరంలో ఉంచండి.
సాధ్యమైనంత వరకు చెల్లింపులు ఆన్లైన్లో చేయండి 
మీరు మీ మెయిల్ బాక్స్ నుంచి ఉత్తరాలు కవర్లను తీసుకున్న తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి 
 
వస్త్రాలను శుభ్రం చేసుకోవడం:
వెచ్చని నీటిని ఉపయోగించి బట్టలు, తువ్వాళ్లు మరియు ఇతరాలు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
మీ బట్టలు వాషింగ్ మెషిన్ కూడా క్రిమిసంహారకం చేయండి లేదా అందులో వైరస్ ని తొలగించగల లైనర్ ఉంచండి
 
మన ఇంటికి అతిథులు వచ్చిన సందర్భాలలో..
ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అతిథులను అనుమతించకపోవడమే మంచిది.
బయట నుంచి వచ్చిన మీరు కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని తప్పని పరిస్థితుల్లో మీ వద్ద ఉంచాల్సిన అవసరం ఉంటే తప్ప వీలైనంత వరకు ఒకే రూమ్ లో ఉండడాన్ని నివారించండి.
 
మీరు ఒకవేళ ఒకే రూంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే మీ మధ్య, ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోండి
 
మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే..
మొదట మీ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించండి 
అనారోగ్యానికి గురైనవారు వాడిన వస్తువులను, ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలోకి మార్చండి 
ప్రతిరోజూ వారు తరచుగా తాకిన ఉపరితలాలను శానిటైజ్ చేయండి
వివిధ వస్తువులను వారితో పంచుకోవడం మానుకోండి
వాషింగ్ మెషిన్ కడిగి శుభ్రం చేసిటప్పుడు చేతికి గ్లౌజులు ధరించండి
మీ చేతులను తరచుగా  కడుక్కోవడం కొనసాగించండి.
అనారోగ్యం పాలైనవారు ఫేస్ మాస్క్ ధరించేలా చెయ్యండి.
 
ఇటువంటి పరిస్థితుల్లో మనకు అవసరపడే సామాగ్రి..
పర్యావరణ పరిరక్షణ సంస్థ ఆమోదించిన క్రిమిసంహారకాలను వాడండి. మీకు క్రిమిసంహారకాలు లభించక పోతే ప్రత్నామ్నాయంగా బ్లీచింగ్ పౌడర్ ని వాడండి.
 
250 మి.లి. నీటికి నాలుగు టీస్పూన్ల బ్లీచింగ్ పౌడర్ కలపండి లేదా 70% ఆల్కహాల్ ద్రావణాన్ని ఉపయోగించండి
 
ఇంటిలో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే..
మీ పెరట్లో మీ పెంపుడు జంతువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.
పెంపుడు జంతువులతో బయట ఆడుకునే సందర్భాల్లో ఇతర వ్యక్తుల నుండి దూరాన్ని పాటించండి.
ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే, మీరు కోలుకునేవరకు వాటినీ జాగ్రత్తగా చూసుకోమ్మని మీతోపాటు ఉండే వారిని అడగండి
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాటిని ముట్టుకుంటుంటే, మీ చేతులను మీ పెంపుడు జంతువులను తరచుగా కడగాలి. 
 
పై విషయాలు తప్పక పాటించినప్పుడు మన ఇల్లు కోవిడ్-19 బారి నుండి సురక్షితంగా ఉంటుంది.