శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:50 IST)

లైంగిక సంబంధానికి నో చెప్పిన విద్యార్థిని.. ఫెయిల్ చేసిన ప్రొఫెసర్

harrasment
దేశంలో లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. 
 
తాజాగా తనతో శారీరక సంబంధానికి అంగీకరించని కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షల్లో ఓ ప్రొఫెసర్ ఫెయిల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ టెక్నికల్ వర్శిటీలో బాధితురాలు చివరి ఏడాది చదువుతోంది. 
 
అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గిరీశ్ పర్మార్ తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని.. లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బాధితురాలని బెదిరిస్తున్నాడు. అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి సాయంతో తనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. 
 
ఆమె లొంగని కారణంగా ప్రొఫెసర్ విద్యార్థినిని ఫెయిల్ చేశాడు. హైడ్రామా నడుమ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.