సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (12:27 IST)

మహిళల లోదుస్తులపై మక్కువ.. చోరీ చేసిన సైకో అరెస్టు

తమిళనాడు రాష్ట్రంలో ఓ సైకోను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళల లోదుస్తులపై మనసు పారేసుకుని వాటిని చోరీ చేస్తూ వస్తున్న ఓ సైకోను పోలీసులు అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లా జిల్లా ఒక్కిలిపాళయం ప్రాంతంలో గత నెల రోజులుగా ఇళ్లలో ఆరవేసిన మహిళల లోదుస్తులు మాయమవుతున్నాయి. కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని  మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు జంకుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు. 
 
చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారైక్కాల్‌ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్‌ గా గుర్తించారు. అతను పగటిపూట తాపీ పనికి వెళుతూ రాత్రిపూట ఆడవారి లోదుస్తులను చోరీ చేసుకెళ్లేవాడని తేలింది.