గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (18:54 IST)

చెట్టు కింద శృంగారం చేస్తుండగా ప్రియురాలికి గుండెపోటు... ఏమైంది?

ఆ ప్రేమికులు శారీరకంగా కలిశారు. కానీ ఆ యువతి లైంగిక కలయిక సమయంలో గుండెపోటుతో మరణించింది. ఈ వ్యవహారం ప్రేమికుడు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో వెల్లడి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, పుదుక్కోట్టై జిల్లాకు చెందిన టీనేజర్ 19 ఏళ్ల కస్తూరి మృతదేహాన్ని పోలీసులు చెరువు నుంచి వెలికి తీశారు. కస్తూరి మృతికి కారణమని అనుమానించిన ఆమె ప్రేమికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పుదుక్కోటై జిల్లా, గీరమంగళం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కస్తూరి.. పక్క గ్రామమైన ఆలంగుడిలోని ఓ ఫార్మసీలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29వ తేదీ ఆమె అదృశ్యమైంది. కస్తూరి కనిపించలేదని ఆమె తరపు బంధువులు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో కస్తూరి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పుదుక్కోట్టై, మల్లిపట్టినం చెరువులో వెలికి తీశారు. ఆపై జరిపిన దర్యాప్తులో.. అదృశ్యమైన రోజు.. కస్తూరి ఓ వ్యక్తితో కలిసి వెళ్లినట్లు చెప్పారు. ఆ వ్యక్తి కస్తూరి ప్రియుడని పోలీసులు తేల్చారు. అతడిని అరెస్ట్ చేశారు. అతడి పేరు నాగరాజని.. అతని వద్ద జరిపిన విచారణలో షాక్ ఇచ్చే నిజాలను తెలియవచ్చాయి.  
 
నాగరాజు మినీ ఆటో నడుపుతున్నాడు. కస్తూరి-నాగరాజులు రెండేళ్ల పాటు ప్రేమలో వున్నారని తెలిసింది. అప్పుడప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగే వీళ్లిద్దరూ.. అక్టోబర్ 29న కూడా అలా షికారు కెళ్లామని.. తైలం చెట్టుకింద శారీరకంగా కలిశామని.. ఆ సమయంలో కస్తూరి గుండెపోటుతో మరణించింది. దీంతో షాకైన తాను సాయంత్రం వరకు అక్కడే కూర్చుండిపోయాను. 
 
చివరికి ఆమె మృతదేహాన్ని చెరువులో పడేశానని... వాంగూల్మం ఇచ్చాడు. కానీ కస్తూరిపై నాగరాజు అత్యాచారానికి పాల్పడి వుంటాడని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కస్తూరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పోస్టు మార్టం దృశ్యాలను వీడియో ద్వారా కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.