శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 అక్టోబరు 2017 (21:01 IST)

32 ఏళ్లు నన్ను వాడుకున్నాడు... భాజపా అభ్యర్థి ఫోటోలు వైరల్

పంజాబ్ రాష్ట్రంలో గురుదాస్ పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వినోద్ ఖన్నా మరణంతో ఆ స్థానంలో స్వరన్ సలారియా బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కూడా అక్టోబరు 11న జరుగనుంది. ఈ నేపధ్యంలో అతడికి సంబంధించి ఓ మహిళ అతడిపై ఆరోపణలు చేస్తూ ఫోటోలు విడుదల చేయడం చర్చనీయాంశంగ

పంజాబ్ రాష్ట్రంలో గురుదాస్ పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వినోద్ ఖన్నా మరణంతో ఆ స్థానంలో స్వరన్ సలారియా బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కూడా అక్టోబరు 11న జరుగనుంది. ఈ నేపధ్యంలో అతడికి సంబంధించి ఓ మహిళ అతడిపై ఆరోపణలు చేస్తూ ఫోటోలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. 
 
తనను 32 ఏళ్లపాటు లైంగికంగా వాడుకున్నాడనీ, 1982 నుంచి 2014 వరకూ నన్ను అన్ని విధాలా వాడుకుని వదిలేశాడని ఆమె ఆరోపించింది. తనను పేయింగ్ గెస్టుగా పెట్టుకుని ఆ తర్వాత తనను లోబరుచుకున్నట్లు ఆమె ఆరోపించడమే కాకుండా అతడితో సన్నిహితంగా గడిపిన ఫోటోలను షేర్ చేసింది. 
 
ఇప్పుడా ఫోటోలు అక్కడ వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను స్థానికులు షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు వెలుగుచూడటంతో అతడి నామినేషన్ తక్షణమే రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. మరోవైపు ఈ పరిణామంతో భాజపా గందరగోళంలో పడింది.