Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకున్నాడు.. మాజీ మంత్రిపై మహిళ కేసు

శనివారం, 30 సెప్టెంబరు 2017 (09:51 IST)

Widgets Magazine
Sucha Singh Langah

పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేత సూచా సింగ్ లంగాహ్‌ (57)పై రేప్ కేసు నమోదైంది. భర్త చనిపోయిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. భర్త చనిపోయిన తనకు ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకుని, ఆర్థికకంగా కూడా మోసం చేశాడంటూ ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై పంజాబ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
39 ఏళ్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను మాజీమంత్రి లంగాహ్‌ను 2009లో కలిశానని అనంతరం యేడాదికే తన భర్త మరణించాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకోవడమేకాకుండా తన ఆస్తులను విక్రయించి డబ్బు తీసుకొని మోసం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
మహిళ ఫిర్యాదు పత్రంతోపాటు అత్యాచారానికి సాక్ష్యంగా మాజీమంత్రి వీడియో క్లిప్‌లున్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులకు అందజేసింది. మహిళ ఫిర్యాదుపై తాము జిల్లా అటార్నీ సలహా తీసుకొని మాజీమంత్రిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ అజాద్ దేవిందర్ సింగ్ చెప్పారు. 
 
కాగా, సూచీ రెండు సార్లు ప్రజాపనుల, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనపై రేప్ కేసు నమోదు కావడంతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షపదవికి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలకు రాజీనామా చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుమార్తె భర్తతో తల్లి అక్రమ సంబంధం... ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?

మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా కామంతో కళ్ళుమూసుకుని పోయిన కొందరు వావివరుసలు ...

news

ఇది సర్కార్ సృష్టించిన నరమేధం : శివసేన

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం పాదచారుల వంతెన ...

news

జైట్లీకి యశ్వంత్ కౌంటర్.. నేను కావాలనుకుంటే నువ్వు అక్కడ ఉండవు...

దేశ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి ...

news

శృంగారంలో పాల్గొని వ్యభిచారిణులకు డబ్బులిస్తే నేరం.. ఎక్కడ?

సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు ...

Widgets Magazine