శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (17:02 IST)

ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్

rahul gandhi
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఆర్థిక అవకతవకల కేసులో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రాహుల్‌తో పాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు జారీచేసింది. అయితే, సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె హాజరుకాలేక పోయారు. 
 
కానీ రాహుల్ గాంధీ మాత్రం సోమవారం ఈడీ విచారణకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి రాగా, ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. 
 
దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రాహుల్.. అక్కడ భోజనం చేసి ఆ తర్వాత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్ వద్ద మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు.