శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (10:19 IST)

రాహుల్‌ గాంధీకి నేడే పట్టాభిషేకం...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి శనివారం పట్టాభిషేకం జరుగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో 47 ఏళ్ల రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి శనివారం పట్టాభిషేకం జరుగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో 47 ఏళ్ల రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. మరో రెండు రోజుల్లో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడనున్న నేపథ్యంలో రాహుల్ పట్టాభిషేకం ఆసక్తిని రేపుతోంది. 
 
రాహుల్ పట్టాభిషేక కార్యక్రమానికి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌తోపాటు ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ ఏకపక్షంగా ఎన్నికైనట్లు ఏఐసీసీ నేత ముళ్ళపల్లి రామచంద్రన్ ఈనెల 11వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన రాహుల్‌కు సర్టిఫికెట్ అందజేస్తారు.
 
కాగా, గత 2013 నుంచి రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత బాధ్యతలు స్వీకరిస్తున్న ఆరో వ్యక్తిగా రాహుల్ నిలవనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. 2019 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పార్టీలో మార్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.