శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (12:47 IST)

శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన 80మంది మృతి..

శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన 80 మంది మృతి చెందారు. దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మే 9 నుంచి 27వ తేదీ వరకు రైల్వేశాఖ నడిపిన సంగతి తెలిసిందే. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలస కార్మికులు మరణించారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సమీక్షలో వెల్లడైంది. 
 
రైల్వేశాఖ మే 1 నుంచి 27వ తేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి 5 మిలియన్ల మంది వలస కార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ఆకలి, వేడి వల్ల పలువురు వలస కార్మికులు రైళ్లలోనే మరణించారు. దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలస కార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. 
 
శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారని రైల్వే అధికారిక ప్రతినిధి వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. రైళ్లలో భోజనం దొరక్క ఎవరూ మరణించలేదని రైల్వేబోర్డు ఛైర్మన్ చెప్పారు.