గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (09:34 IST)

9వ తరగతి విద్యార్థినిపై 12 క్లాస్ మైనర్ బాలుడు అత్యాచారం...

రాజస్థాన్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 24వ తేదీన బిచివారాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు. అపుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు భోజనం చేయడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది.
 
అప్పటికే అక్కడ చేరిన 12వ తరగతి బాలుడు ఒకడు ఆ బాలికను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని స్కూలుకు దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటివద్ద వదలిపెట్టాడు. 
 
అయితే, ఆ బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.