Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజస్థాన్ 'లవ్ జిహాద్' వీడియో

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:58 IST)

Widgets Magazine
love jihad

రాజస్థాన్ రాష్ట్రంలో లవ్ జీహాద్ పేరుతో ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన వ్యవహారం ఇపుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలాంటి పాతకక్షలు లేకపోయినప్పటికీ ఓ వ్యక్తిని అతికిరాతకంగా సుత్తితోకొట్టి చంపి ఆతర్వాత శవంపై కిరోసిన్ పోసి నిలువునా తగులబెట్టేశాడు. 'లవ్ జిహాద్' పేరిట తను చేసిన క్రూరత్వాన్ని స్వయంగా వీడియో తీసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. 
 
రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ జిల్లాలో శంబూనాథ్ రాయ్ (30) అనే వ్యక్తి లవ్ జిహాద్‌పై చెప్పలేనంత కోపం ఉంది. ఈ క్రమంలో రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ భట్టా షైక్ అనే వ్యక్తి హెరిటేజ్ రోడ్డులోని ఓ పార్కులో సాయంత్రం వేళలో కూర్చొని సేదతీరుతున్నాడు. 
 
అతడిపై శంబునాథ్ ఓ సుత్తితో మెరుపుదాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శంబూనాథ్‌ను అరెస్టు చేశారు. 
 
ఈ ఘటనపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఘటనపై సిట్ బృందాన్ని నియమించారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. అందరూ సంయమనం పాటించాలని మంత్రి కోరారు. కాగా, శంబూనాథ్ అప్‌లోడ్ చేసిన వీడియోను అన్ని సోషల్ ప్రసార మాధ్యమాలు తమతమ సైట్ల నుంచి తొలగించాయి. ఆవీడియోను ఓసారి చూడండి. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీ లిక్కర్ మాఫియా దాష్టీకం : మహిళ నగ్న ఊరేగింపు

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ...

news

చంద్రబాబుది తల్లి టీడీపీ-జనసేన పిల్ల టీడీపీ: రోజా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు ...

news

పెళ్లి తర్వాత మతం మారదు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ...

news

ఇజ్రాయేల్ రాజధాని జెరూసలెం: భారత్ ప్రకటన ఇదే

ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుందని అమెరికా అధ్యక్షుడు ...

Widgets Magazine