తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

గురువారం, 7 డిశెంబరు 2017 (09:41 IST)

tiruchy road accident

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం అర్థరాత్రి జరిగింది. తిరుచ్చి జిల్లా తువరన్‌కురిచ్చి దగ్గర జాతీయ రహదారిపై బోర్‌వెల్‌ వాహనాన్ని.. వ్యాన్‌ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ వాహనాన్ని డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో ...

news

ఆ నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు ...

news

సిబిఐటీలో అవినీతి.. విద్యార్థులపై ఫీజు బండ

హైదరాబాద్‌ గండిపేటలోని సిబిఐటి కళాశాలలో బుధవారం నాడు విద్యార్థినీవిద్యార్థులు ధర్నా ...

news

బోయలకు దేవుడు చంద్రబాబు... వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్

అమరావతి: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకొని, వారిని ఎస్టీల జాబితాలో ...