చంద్రబాబుపై రజినీకాంత్ పరోక్ష వ్యాఖ్యలు... అలా చేయడం ప్రమాదకరం అంటూ...
వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు అధికార పగ్గాలు అందకుండా చేసేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంగా దక్షిణాది నుంచి తెదేపా చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఐతే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఇలా దేశంలోని అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం ప్రమాదకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడుపైన చేసినట్లు భావిస్తున్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలను చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు ఆయన మద్దతు తెలుపుతారన్న అనుమానం కలుగుతోంది. నరేంద్ర మోదీని ప్రమాదకర శక్తి అంటూ కొన్ని విపక్షాలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయనను గద్దె దింపేందుకు ఏకమవడం ప్రమాదకరం అని రజినీ చెప్పుకొచ్చారు.