శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (16:35 IST)

అయోధ్య రామునికి చలి చలి.. దుప్పట్లు కప్పేశారు.. హీటర్లు కూడా..?

ఉత్తరప్రదేశ్‌లో చలితీవ్రత పెరిగింది. దీంతో అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహంతో పాటు ఇతర దేవుళ్లకు చలిపెట్టకుండా కప్పేందుకు దుప్పట్లు, గది ఉష్ణోగ్రతలు పెరిగేలా హీటర్స్ ఏర్పాటు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇది రెండోసారి. 
 
గతేడాది స్థానిక హందూ మత పెద్దలు కొంత మంది విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులతో కలిసి అయోధ్య కమిషనర్‌కు అభ్యర్థన చేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేశారు. 
 
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆలయంలో దేవుళ్లు చలిలో బాధపడకుండా చూసుకునేందుకు. హీటర్లను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ తెలిపారు. ఇది కాకుండా, వెచ్చని దుప్పట్లు కప్పామన్నారు. 
 
ఆలయంలో ఫైర్‌ప్లేస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నామని.. అయితే ఈ తాత్కాలిక ఆలయం చెక్క, గాజుతో తయారు చేశారని తెలిపారు. అది సురక్షితం కాదని విరమించుకున్నామన్నారు. చలి తగ్గేవరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పారు సత్యేంద్రదాస్.