Widgets Magazine

డేరా బాబా ఒత్తిడి వల్లే అది చేశా.. బాబాకు లొంగని వాళ్లను కుర్చీకి కట్టేసి?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (15:25 IST)

Widgets Magazine

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ గాయ‌కురాలు, డాన్స‌ర్‌.. తాజాగా గుర్మీత్ గురించి తాను అనుభవించిన కష్టాలను బయటపెట్టారు. డేరా బాబా కేసు విచార‌ణ‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఆమె చండీగ‌ఢ్‌కు వ‌చ్చారు. గుర్మీత్ బాబా గొప్ప‌త‌నాన్ని ప్ర‌చారం చేయ‌డానికి ఆమెను బాబా పావుగా వాడుకున్నాడని తెలిసింది. 
 
డేరాబాబాపై ప్రచారం చేయడం ఇష్టం లేకపోయినా.. అత‌ని అనుచ‌రుల ఆగ‌డాల‌కు భ‌య‌ప‌డి ఆడుతూ, పాడుతూ వుండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. గతంలో  గుర్మీత్‌ను కీర్తిస్తూ ఆమె పాడిన కొన్ని పాట‌లు వివాదాల‌ను రేకెత్తించాయి. వాటిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. కేసు విచార‌ణ‌లో భాగంగా- ఆమె చండీగ‌ఢ్ హైకోర్టుకు వ‌చ్చింది. తాను ఉద్దేశ‌పూర‌కంగా ఆ పాట‌ల‌ను పాడ‌లేద‌ని, గుర్మీత్ ఒత్తిడితోనే ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని న్యాయ‌మూర్తుల‌కు వివ‌రించింది. బేషరతుగా క్షమాపణలు కోరింది. 
 
మరోవైపు సాధ్వీల అత్యాచారం కేసులో గుర్మత్ రామ్‌రహీంకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల బాలికను కూడా డేరా బాబా వదిలిపెట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. గురుదాస్ అనే బాబా బాధితుడు కీలక నిజాలను పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బాబా దగ్గరకు సాధ్విలు అమ్మాయిలను తీసుకెళ్లేవారని.. వారు ఎదురుతిరిగితే వారిని హింసించేవారని.. ఆపై బాబా వద్దకు వెళ్తే పునీతులు అవుతారని నచ్చజెప్పే వారని గురుదాస్ చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళపై పదిమంది గ్యాంగ్ రేప్.. ఇద్దరు మైనర్లు కూడా.. హింసించి.. 15గంటలు?

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మైనర్లతో పాటు పదిమంది దారుణంగా ...

news

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

news

డొమినోస్ పిజ్జా ఓరెగాన్ ప్యాకెట్లలో పురుగులు... వీడియో చూడండి

డోమినోస్ పిజ్జా సంస్థ చిక్కుల్లో ఇరుక్కుంది. తాను ఆర్డ‌ర్ చేసిన పిజ్జా సీజ‌నింగ్ ...

news

డేరా ఆస్పత్రిలో రోగుల ఆపరేషన్ల కంటే అబార్షన్లే ఎక్కువ..

వివాదాస్పద రాసలీలల గురువు డేరా బాబా అలియాస్ గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో బాలికలతో పాటు.. కన్య ...