శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 ఆగస్టు 2018 (13:32 IST)

కేరళ వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ రూ. 21 కోట్ల విరాళం... వారం పాటు ఉచిత వాయిస్

హైదరాబాద్: వరదలతో సర్వం కోల్పోయి కన్నీళ్లు పెడుతున్న కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతోపాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస

హైదరాబాద్: వరదలతో సర్వం కోల్పోయి కన్నీళ్లు పెడుతున్న కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతోపాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తూ, సహకార చర్యల్లో తమ వంతు సహకారం చేస్తోంది.
 
వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ సహాయక చర్యల్లో పాల్గొంది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిస్సుర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో వలంటీర్లు పనిచేస్తున్నారు.
 
రిలయన్స్ రిటైల్ తరుపున 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్‌ని పంపిణీ చేస్తోంది. అలాగే, కేరళలో వారంరోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు జియో ప్రకటించింది.