సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (10:57 IST)

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

రాజధాని అమరావతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో... ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన విజయవాడలో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఎగరవేసి... వందనాలు సమర్పించారు.

రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.
 
71వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇకపోతే.. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో 71వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం వేడుకలు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకుని ఉండటం గమనార్హం.