గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (11:13 IST)

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు

malli kharjuna kharge
బజరంగ్ దళ్ పరువు నష్టం దావా కేసులో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ కోర్టు నోటీసులు జారీచేసింది. బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న హిందూ సురక్షా పరిషత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
బజరంగ్ దళ్‌ను నిషేధిత సంస్థ పీఎఫ్ఐతో మల్లికార్జున ఖర్గే ఇటీవల పోల్చారు. దీనిపై హిందూ సురక్షా పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల పదో తేదీలోపు సమాధానం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను ఆదేశించింది.