Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ ఆస్తులు రూ.5 లక్షల కోట్లా?

సోమవారం, 20 నవంబరు 2017 (08:36 IST)

Widgets Magazine
sasikala

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అడ్డుపెట్టుకుని శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దేశ వ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆదాయన్ను శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా, శశికళ కుటుంబానికి మొత్తం ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెల్లడైంది. దీంతో మరోమారు శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో భారీ ఎత్తున సోదాలు జరిపేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇటీవల శశికళ, దినకరన్, వారి కుటుంబ సభ్యులు, అనచరులు, బినామీల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో అనేక కీలక పత్రాలు, దస్తావేజులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. వాటిని పరిశీలించగా, వారికి కళ్లు చెదిరిపోయే వాస్తవాలు తెలిసినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా,శశికళ, ఆమె కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలను కొనుగోలు చేసి, బినామీల ద్వారా వాటిని నిర్వహిస్తున్నట్టు తేలిందని ఓ ఐటీ అధికారి వ్యాఖ్యానించారు. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల పొయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 
 
ఇందులోని సమాచారం ఆధారంగానే ఆమెకు దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. దీంతో మరోమారు తనిఖీలు నిర్వహించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. శశికళ కుటుంబ  సభ్యులు, బంధువులు, బినామీలకు మొత్తం 240 బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశి గ్యాంగ్ వల్లే అమ్మ నివాసంలో ఐటీ సోదాలు : మంత్రి జయకుమార్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి ...

news

'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ...

news

గన్ పాయింట్‌లో దోపిడీ.. (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు ఘోరాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు ...

news

ఎపుడైనా రాహుల్‌కు పట్టాభిషేకం...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఇందుకోసం ...

Widgets Magazine