గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (15:51 IST)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయండి : సుప్రీంలో పిటిషన్

eknath shinde
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను శివసేన పార్టీ విఫ్ సునీల్ ప్రభు దాఖలు చేయగా, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 
 
సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. దీంతో జూలై 11వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 
 
కాగా, శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఇపుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సొంత అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏకంగా 45 మందికిపై ఎమ్మెల్యేలను తన చెంతకు చేరుకున్నారు. వారిని ఒక శిబిరంగా చేసుకుని బీజేపీ మద్దతుతో ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.