Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నతండ్రి కాదు.. రాక్షసుడు... పిల్లలు బట్టలు మురికి చేస్తున్నారనీ... (వీడియో)

బుధవారం, 31 జనవరి 2018 (11:49 IST)

Widgets Magazine
child beat

అన్నెం పున్నెం ఎరుగని అమాయక చిన్నారులు వారు.. లాలించి.. ఆడించి.. పెంచాల్సిన వయసు వారిది. భయపెట్టకుండా.. బెదిరించకుండా.. అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు పిల్లలపై రాక్షసత్వం ప్రదర్శించాడు. బట్టలు మురికి చేస్తున్నారని అభం శుభం తెలియని చిన్నారులను విచక్షణారహితంగా తండ్రి చితకబాదాడు. కుమారుడిని తాడుకు వేలాడతీసి, కుమార్తెను బెత్తంతో చావబాదాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజసమంద్ జిల్లా ఫుకియాథడ్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. 
 
రాజసమండ్‌కు చెందిన చైన్ సింగ్(32)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు, మరో చిన్నారి ఉంది. అయితే కుమారుడు, కూతురు బట్టలు మురికి చేస్తున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. 
 
విషయం బాలల సంక్షేమ సమితి అధికారులకు ఇరుగు పొరుగువారి ద్వారా చేరింది. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వాస్తవాలు వెలుగుచూశాయి. బాధిత చిన్నారులను ప్రశ్నించగా తమ తండ్రి(చైన్ సింగ్ రావత్) తరచూ చావగొడుతుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు చైన్‌సింగ్... కొడుకు లలిత్‌ను తాడుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. అలాగే కుమార్తెను కూడా బెత్తంతో చావగొట్టాడు. ఈ సమయంలో తల్లి పక్కనే ఉన్నప్పటికీ అడ్డుకోలేదు. 
 
కాగా దీనికి సంబంధించిన వీడియోను చైన్‌సింగ్ సోదరుడు బన్నా చిత్రీకరించాడు సమాచారం అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద నిందితుడు చైన్‌సింగ్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీరూ ఓసారి తిలకించండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యువకుడితో టీచర్ రాసలీలలు.. వీడియో వైరల్.. ఫోటోలు లీక్

ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలి రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ...

news

మీటింగ్‌లో నిద్రపోయాడనీ... మిషన్‌ గన్‌‌తో కాల్చి చంపిన కిమ్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్... తనకు వ్యతిరేకంగా పని ...

news

సాయం కోసం వచ్చిన మహిళను ఎస్ఐ ఏం చేశాడంటే...

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో ...

news

అమెరికన్ నటుడు ఆత్మహత్య: లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో..

లైంగిక వేధింపులు.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ నటుడు ఉరేసుకుని ...

Widgets Magazine