శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (15:41 IST)

తండ్రి డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటినే పేల్చేశాడు..

blast
డబ్బుల కోసం సొంత ఇంటినే కూల్చేశాడు దుర్మార్గుడు. తండ్రి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో సొంత ఇంటిపైనే బాంబు దాడి చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేలచ్చేరి భారతీనగర్‌లో పనీర్‌సెల్వం (60) అనే వ్యక్తికి ఇటీవల భూమిని విక్రయించడంతో డబ్బు చేతికి అందింది. 
 
ఈ డబ్బు వచ్చిన సంగతి తెలుసుకున్న పనీర్ సెల్వం కుమారుడు అరుణ్.. తనకు మూడు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఇందుకు పనీర్ నిరాకరించాడు.  ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అరుణ్‌ తన బావ ప్రవీణ్‌తో కలిసి ఇంటిపై పేలుడు పదార్ధం విసిరాడు. 
 
ఈ ఘటనలో ప్రవీణ్‌ సోదరి రేఖ, మేనమామ వెట్రివేందన్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేయగా వారి ఇంట్లో మరో నాలుగు బాంబులు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులు, అరుణ్ తీవ్రంగా గాలిస్తున్నారు.