శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (13:20 IST)

సోనియా గాంధీకి అస్వస్థత.... ఆస్పత్రిలో అడ్మిట్

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు.

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న తన సొంతిటిని పరిశీలించేందుకు ఇటీవల సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛరబ్రా వెళ్లారు. గురువారం అర్థరాత్రి సమయంలో సోనియా అస్వస్థతకు గురవడంతో ఆమె వెంట ఉన్న డాక్టర్‌ ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరారు. 
 
అంబులెన్స్‌ వచ్చే‌లోపే సోనియా తన కారులో బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక వైద్యుల బృందం అంబులెన్స్‌లో వచ్చి ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.