సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (15:12 IST)

ఆశీర్వాద్ ఆటా పిండిలో ప్లాస్టిక్ లేదు.. ఐటీసీ స్పష్టం

మ్యాగీ వంటి ప్యాక్డ్ ఫుడ్‌‌లో రసాయనాలున్నాయంటూ దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆశీర్వాద్ ఆటా పిండిపై కూడా వివాదం రేగింది. ఆశీర్వాద్ ఆటా పిండిలో ప్లాస్టిక్ వుందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచా

మ్యాగీ వంటి ప్యాక్డ్ ఫుడ్‌‌లో రసాయనాలున్నాయంటూ దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆశీర్వాద్ ఆటా పిండిపై కూడా వివాదం రేగింది. ఆశీర్వాద్ ఆటా పిండిలో ప్లాస్టిక్ వుందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఐటీసీ సంస్థ స్పందించింది. ఆశీర్వాద్ ఆటాపై దురుద్దేశపూర్వకంగా వీడియోలను పోస్టు చేస్తుండటంపై ఐటీసీ మండిపడింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, ఢిల్లీలో కూడా మరో ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేయనున్నట్లు ఐటీసీ ప్రకటించింది. 
 
హైదరాబాద్, కోల్‌కతాలోనూ ఈ వీడియోలపై సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయని ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ చెప్పారు. ఆశీర్వాద్ ఆటా వినియోగానికి పూర్తి సురక్షితమని హేమంత్ మాలిక్ స్పష్టం చేశారు. వీడియోల్లో చూపిస్తున్నది చెబుతున్నది గోధుమలోని ప్రొటీన్ అని చెప్పుకొచ్చారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ సైతం గోధుమ పిండిలో  ఆరు శాతం గ్లూటెన్ ఉండాలని నిర్దేశించిందని, నకిలీ వీడియోలను నమ్మవద్దని హేమంత్ తెలిపారు.