బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (11:19 IST)

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ ఫోటోలో ఉన్నట్టు శిక్ష విధిస్తారా?

ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ కాళ్లు ఉన్నచోట చేతులు, చేతులు ఉన్నచోట కాళ్లు తగిలించారు. ఆ వ్యక్తిని ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ కాళ్లు ఉన్నచోట చేతులు, చేతులు ఉన్నచోట కాళ్లు తగిలించారు. ఆ వ్యక్తిని ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది. 
 
వాస్తవానికి ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో అబ్దుల్లా అనే వ్యక్తి షేర్ చేశాడు. ఫొటోలోని వ్యక్తి అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న కారణంగా భగవంతుడు ఇటువంటి శిక్ష విధించాడని కామెంట్ పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు తమ రియాక్షన్స్ తెలియజేశారు. 
 
'ఈ వ్యక్తి మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందుకే పైవాడు అతనికి ఇటువంటి శిక్ష విధించాడని' అని కామెంట్ చేశారు. కానీ, ఈ ఫోటో వెనుక గల నిజానిజాలను తెలుసుకోకుండా ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం. 
 
వాస్తవానికి ఈ ఫొటోలో ఉన్నది నైజీరియా నటుడు ముకాయిలా. అతనికి మేకప్ సహాయంతో ఇలాంటి లుక్ తీసుకొచ్చారు. హమీమ్ అనే వ్యక్తి ఇతనికి మేకప్ చేసి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపోయేలా చేతులు ఉన్నచోట కాళ్లు, కాళ్లు ఉన్నచోట చేతులు అమర్చాడు. ఈ ఫోటను మీరూ చూడండి. నిజానికి ఈ ఫోటో గత యేడాది ఆగస్టు 21వ తేదీన పోస్ట్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా, ఇపుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.