Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ స్కామ్... బ్యాంకులకు రూ.6 వేల కోట్ల పంగనామం

బుధవారం, 14 మార్చి 2018 (10:50 IST)

Widgets Magazine
cash

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్కామ్ ఒకటి వెలుగు చూసింది. బ్యాంకులకు ఏకంగా ఆరు వేల కోట్ల మేరకు ఓ కంపెనీ పంగనామం పెట్టింది. ఆ కంపెనీ పేరు ది ఇండియన్ టెక్నోమ్యాక్. ఈ కంపెనీ 6000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. 
 
ఎఫ్ఐఆర్‌లో ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీ 2,175 కోట్ల రూపాయల పన్నుతో పాటు మరొక 2167 కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. దాంతో పాటు మరో 20 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని పేర్కొంది. 
 
ఇలా మొత్తం 6,000 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకులకు ఎగవేసినట్టు పేర్కొంటూ ఆ కంపెనీ ఛైర్మన్‌ రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, రంజన్‌ మోహన్‌, అశ్విన్‌ సాహూలపై కేసులు నమోదు చేసింది. వీరంతా కలిసి దాదాపు 16 బ్యాంకులకు ఎగనామం పెట్టినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 
 
కాగా, ఇటీవలే సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీ, రొటొమాక్ పెన్నుల తయారీ కంపెనీ అధినేత విక్రమ్ కొథారీలు కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన విషయం తెల్సిందే. వీరిలో నిరవ్ మోడీ విదేశాలకు పారిపోగా, విక్రమ్ కొథారిని సీబీఐ అరెస్టు చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

15న బంధన్ బ్యాంకు పబ్లిక్ ఇష్యూ

దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంకు బుధవారం తన పబ్లిక్ ఇష్యూను ...

news

హమ్మయ్యా.. బాదుడు నుంచి ఊరట : ఎస్.బి.ఐ శుభవార్త

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) ...

పంచకావ్యం పేరుతో నంది బ్రాండ్ సేంద్రీయ ఎరువులు

పంచకావ్యం పేరుతో సేంద్రీయ ఎరువులు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై కేంద్రంగా ...

news

బీజేపీకే మా మద్దతు.. మోదీ హోదా ఇస్తారు: వైకాపా ఎంపీ విజయసాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వైఖరి ఏంటో తేలిపోయింది. టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ...

Widgets Magazine