Widgets Magazine

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ : చందా కొచ్చర్ - శిఖా శర్మలకు ఉచ్చు

మంగళవారం, 6 మార్చి 2018 (13:50 IST)

Widgets Magazine
chanda kochchar

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నోటీసులు జారీచేసింది. ముకుల్ చోక్సీకి చెందిన గీతాంజలి నగల సంస్థకు రుణాలు మంజూరు చేయడంపై విచారణ జరిపేందుకు ఈ ఇరువురు టాప్ బ్యాంకర్లకు నోటీసులు జారీచేసినట్టు చెబుతున్నారు.
 
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు ఏసీబీ నోటీలు జారీ చేయడం ఇపుడు దేశ బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది.
 
కాగా, నీరవ్‌ మోడీతో తమకెలాంటి సంబంధం లేదని.. గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఎంత అప్పు ఇచ్చిందనే విషయాన్ని తెలపలేదు. అలాగే, యాక్సిస్‌ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూపునకు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్‌ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పేరుకే కోటీశ్వరులు.. కానీ నాలుగు రోజులు అందుకు ఖర్చు పెడితే బికారులే....?

రాబిన్‌హుడ్ ఇండెక్స్.. ఇదేంటి అంటారా.. కొత్తగా 2018 సంవత్సరంలో ఈ వెబ్‌సైట్ కొన్ని సంచలన ...

news

లగ్జరీ రైళ్ల ఛార్జీలు సగానికి సగం తగ్గిపోనున్నాయట..

లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ ...

news

ఆ బ్యాంకు సిబ్బందికి లంచాలుగా వజ్రాలు.. బంగారు ఆభరణాలు

దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ ...

news

బ్యాంకులను దోచుకుని పారిపోయే వాళ్ల కోసం కొత్త చట్టం : కేబినెట్

బ్యాంకుల్లో భారీ మొత్తంలో రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయేవాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ...