Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుటుంబాన్ని కాపాడి అమరుడైన సుబేదార్ మదన్‌లాల్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:52 IST)

Widgets Magazine
madan lal

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ప్రాణాలతో రక్షించి చివరకు తాను మాత్రం అమరుడయ్యాడు ఓ జవాన్. అతని పేరు మదన్ లాల్ చౌదరి. భారత ఆర్మీల్ సుబేదార్‌గా పని చేస్తున్నాడు. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సుంజ్వాన్ 36బ్రిగేడ్ సైనికశిబిరంలోకి శనివారం ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే. 42గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో ముగ్గురు జైషే మొహమ్మద్ ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సైనికులు, ఇద్దరు భద్రతాసిబ్బంది ఉన్నారు.
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో మదన్ లాల్ ఒకరు. సుంజ్వాన్‌లో ఆర్మీ క్వార్టర్స్‌లోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు సుబేదార్ మదన్‌లాల్ చౌదరి తన ఇంట్లో ఉన్నాడు. అయితే కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులు ద్వారం వద్దకు దూసుకొచ్చారు. ఆ క్షణంలో తను నిరాయుధుడు.
 
పైగా ఒక్కరోజు ముందే ఓ పెండ్లివేడుక కోసం షాపింగ్ చేసేందుకు ఆయన భార్య, పిల్లలు ఆ క్వార్టర్‌కు వచ్చారు. అప్పటికే వారంతా భయాందోళనలో ఉన్నారు. ఉగ్రవాదులు లోపలికి రాకుండా ద్వారం వద్దే వారిని అడ్డుకున్న మదన్‌లాల్ కుటుంబ సభ్యుల్ని వెనుక ద్వారం గుండా బయటకు వెళ్లిపోవాల్సిందిగా కేకలేశాడు. 
 
ఆగ్రహించిన ముష్కరులు తుపాకీతో తనపై కాల్పులు వర్షం కురిపిస్తున్నా, తన భార్య, పిల్లలు బయటకు వెళ్లేవరకు వారిని అడ్డుకుని, చివరకు నేలకూలాడు. కూతురు నేహాకు తూటా గాయం అయినప్పటికీ ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడిందంటే అందుకు మదన్‌లాల్ చూపిన తెగువే కారణం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మాయిలు కూడా బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోంది : మనోహర్ పారికర్

ఈ కాలపు అమ్మాయిలు బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ...

news

సన్నీలియోన్ అర్ధనగ్న ఫోటోలను రైతులు అలా ఉపయోగిస్తున్నారట?

నరదిష్టి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార ...

news

పవన్‌లో అది నచ్చింది.. నిజమైన రాజకీయాలు?: ఉండవల్లి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, సామాన్య పౌరుడిలా ప్రశ్నలేశారని.. ...

news

కేంద్రం ఇచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చు చేసిందెంత? పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ ...

Widgets Magazine