శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:18 IST)

వచ్చే ఎన్నికల్లో నా తడాఖా చూపిస్తా : రజినీకాంత్

వచ్చే ఎన్నికల్లో తన తడాఖా చూపిస్తానని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. తన కొత్త చిత్రం దర్బార్ షూటింగ్ నిమిత్తం ఆయన శుక్రవారం ముంబైకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు కదా? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాలపై అమితాసక్తి చూపుతున్న తన అభిమానులను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరశపరచబోనని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా? అని మీడియా ఆయనను ప్రశ్నించగా.. మే 23న తెలుస్తుంది కదా అని చెప్పారు. గురువారం తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక వేళ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే మెజార్టీ తగ్గితే.. ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.