Widgets Magazine

మళ్ళీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం.. సుప్రీంలో పిటిషన్

గురువారం, 17 మే 2018 (19:49 IST)

హోమో సెక్సువల్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377ను రద్దు చేయాలని కోరుతూ గురువారం ఓ పిటిషన్ దాఖలుకాగా, దీన్ని విచారణకు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
supreme court
 
ఐపీసీ సెక్షన్-377 రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఐపీసీ సెక్షన్‌-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశంపై గతంలో చాలా వరకు పిటిషన్లపై తీర్పు పెండింగ్‌లో ఉన్నాయి. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిదన్న ఓ అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అసహజ శృంగారాన్ని ప్రోత్సహించే అంశం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 
 
నిజానికి ఈ సెక్షన్‌ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పైగా, ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం వాటిలో నెలకొంది. అయితే, 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్‌ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 
 
కానీ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు 2013, డిసెంబర్‌ 11న విభేదించింది. పైగా, ఈ సెక్షన్‌ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగదని సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. ఇదిలావుంటే, 1950 నుంచి ఇప్పటివరకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా… సెక్షన్‌ 377ను టచ్ చేయకపోవడం గమనార్హం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
హోమో సెక్సువల్ ఐపీసీ Homosexuality Plea సుప్రీంకోర్టు Ipc Section 377 Supreme Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

చైనా క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్.. అందంగా వున్నావని పట్టపగలే?

మహిళలపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. చైనాలో మహిళా ప్రయాణీకురాలిపై ...

news

కన్నడనాట 'ఆపరేషన్ ఆకర్ష్' స్టార్ట్ : ఐపీఎస్ అధికారుల బదిలీ... ఎమ్మెల్యేలకు గాలం...

పలు నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం 9 గంటలకు కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ...

news

గోవా - బీహార్‌లను తాకిన కర్ణాటక సెగ... రాజ్‌భవన్‌ గడప తొక్కనున్న కాంగ్రెస్ - ఆర్జేడీ

కర్ణాటక రాజకీయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ ...

news

2007లో 7 రోజులు - 2008లో 1157 రోజులు... 2018లో? యడ్యూరప్ప సీఎంగా కొనసాగేనా?

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మంచి నేతగా, అందరిని కలుపుకునిపోయే నేతగా బీఎస్. యడ్యూరప్పకు ...

Widgets Magazine