Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గవర్నర్ కోర్టులో కర్ణాటక బంతి.. ఛాన్సివ్వకుంటే న్యాయపోరాటం

బుధవారం, 16 మే 2018 (12:14 IST)

Widgets Magazine

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బంతి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కోర్టులో ఉంది. ఆయన కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు.. బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో కొత్త  ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
bjp - congress
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా జేడీఎస్‌లో చీలిక లేదని ఆ పార్టీ నేత కుమారస్వామి గౌడ చెబుతున్నారు. 
 
కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగడితే సరిపోదు. అందుకే, జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్తపడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఇప్పటికే కేరళ పర్యాటక శాఖ కూడా ఆహ్వానం పలికుతూ ట్వీట్ కూడా చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక రిసార్ట్స్ రాజకీయాలు... కర్ణాటక ఎమ్మెల్యేలకు కేరళ పర్యాటక మంత్రి ఆహ్వానం

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ...

news

మరో దాచేపల్లి కారాదు... పాతగుంటూరు రేప్‌పై సీఎం సీరియస్

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 యేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ...

news

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా ...

news

కింగ్ మేకర్ కాదట.. కర్ణాటక కింగేనట ... తండ్రి బాటలో తనయుడు...

మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమార స్వామి. ఈయన ఇపుడు కర్ణాటక రాజకీయాల్లో 'కింగ్ మేకర్'. ...

Widgets Magazine