తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

supreme court
Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:35 IST)
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెరాస సర్కారుకు కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టంచేసింది.

తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అత్యధికంగా ఉండటంతో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరాగా రిజర్వేషన్లు పెంచడం కుదరని పని అని అసలు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు వెలువరించింది.

అయితే, తెరాస సర్కారుకు ఎస్సీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుకై పోరాటం చేస్తామని తెరాస సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇచ్చింది. అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేసింది.దీనిపై మరింత చదవండి :