శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (07:56 IST)

నిర్భయ దోషుల ఉరికి తలారీ సిద్ధం

నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్ష విధించనున్న నేపథ్యంలో తీహార్ జైలు అధికారులకు ఎట్టకేలకు తలారీ దొరికారు. తీహార్ జైలులో దోషులను ఉరి తీసేందుకు వీలుగా తలారీని పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ కు లేఖ రాశారు.

దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో ప్రస్థుతం ఇద్దరు తలారీలు పనిచేస్తున్నారు. మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ ను తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించేందుకు వీలుగా తీహార్ జైలుకు యూపీ జైళ్ల శాఖ అధికారులు పంపించారు.

తీహార్ జైలులో తలారీ లేనందున దేశంలోని అన్ని జైళ్ల అధికారులకు తలారీ ఉంటే పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు లేఖలు రాశారు. తీహార్ జైలు అధికారుల లేఖతో యూపీ జైళ్ల శాఖ స్పందించి తలారీని తీహార్ జైలుకు పంపించింది.