సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (19:12 IST)

తెలంగాణకు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం పళణిస్వామి

గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ వర్షాల ధాటికి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో హైదరాబాదులో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం పళణిస్వామికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన తమిళనాడు సీఎం భారీ వర్షాలు వరదలతో నష్టపోవడం విచారకరమన్నారు.
 
తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజలకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేస్తామని, సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణమే 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
 
వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినందుకు గాను తమిళనాడు సీఎం పళణిస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.