1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (16:00 IST)

కరోనా నుంచి రక్షణ : చచ్చిన పామును ఆరగించిన రైతు కూలీ

గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బాధితులుగా ఉన్నారు. 
 
ఈ వైరస్ స్వైర విహారం దెబ్బకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిపై అపోహలు ఉన్నాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కరోనా నుంచి రక్షణ కలిగిస్తుందంటూ చచ్చినపామును తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అతడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు ఓ రైతు కూలీ. ఇటీవల వడివేలు ఓ చచ్చినపామును తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పామును తింటే కరోనా రాదని వడివేలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. 
 
కరోనా నుంచి రక్షణ కోసమే పామును చంపి తింటున్నానని అతడు వివరించాడు. అయితే ఈ వీడియో స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వడివేలును అరెస్ట్ చేశారు. అతడికి ఏడు వేల రూపాయలు జరిమానాగా విధించారు.