శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (19:01 IST)

కుటుంబ శ్రేయస్సు కోసం కుమార్తెను చంపేసిన కన్నతండ్రి?

ఆ యువతి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుటుంబం బాగు కోసం ఏకంగా కన్నబిడ్డనే హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లా కాందవర్ కోట్టైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాందవర్ కోట్టై ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మంత్రశక్తులపై గుడ్డినమ్మకం. కుమార్తెను చంపితే కుటుంబంలో ఉన్న బాధల నుంచి విముక్తి పొంది.. సంతోషంగా ఉంటారని ఓ మహిళా మంత్రగత్తె చెప్పింది. అంతే.. ఆ వ్యక్తి ఇంకేం ఆలోచన చేయకుండా కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రితో పాటు కుమార్తె హత్యకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.