Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియురాలి రిసెప్షన్‌కు వచ్చి వధువుతో పరార్.. పెళ్ళికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది?

శుక్రవారం, 3 నవంబరు 2017 (14:54 IST)

Widgets Magazine
marriage

తాళికట్టే సమయానికి పెళ్లాగిపోయింది. అంతే పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న చిన్న పల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి తురైయూరులోని కూరగాయల వ్యాపారం చేసుకునే వెంకటేశన్‌‍కు.. మన్నసనల్లూరుకు చెందిన కన్యతో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
 
కానీ వరుడు తాళికట్టబోయే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లికూతురు మైనర్ కావడంతో.. 18ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే తల్లిదండ్రులు జైలుకెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు. అంతే పెళ్లాగిపోయింది. 
 
అయితే కొద్ది రోజులు ఆగి మళ్ళీ పెళ్ళి చేసుకుందామని వెంకటేశన్, వారి బంధువులు అనుకోలేదు. అదే వేదికపై వివాహం జరిపించాలనుకున్న వరుడు తరపు బంధువులు పెళ్ళికొచ్చిన అమ్మాయిల్లో వధువు కోసం వెతికి.. చివరికి వెంకటేశన్ దూరపు బంధువు కుమార్తెను ఎంపిక చేసి వారికి పెళ్ళి చేసేశారు. 
 
మరోవైపు వివాహ రిసెప్షన్‌కు వచ్చి.. వధువుతో ఓ యువకుడు పరారైన ఘటన కూడా తమిళనాడులోని వేలూరులో జరిగింది. తన ప్రియురాలి వివాహ రిసెప్షన్‌కు వచ్చిన ఓ యువకుడు బహుమతి ఇచ్చి.. సమయం చూసుకుని వధువుతో కలిసి ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. వేలూరు తిరువలానికి చెందిన యురేసియా (24)చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. 
 
ఆమె గతంలో భెల్ సంస్థలో ఉద్యోగం చేస్తోన్న వెంకటేశన్ (25)ను ప్రేమించింది. వీరి ప్రేమకు యురేసియా కుటుంబీకులు అంగీకరించకపోవడంతో పాటు వేరొకరితో వివాహం నిశ్చయించారు. గురువారం వివాహం జరగాల్సి వుండగా, బుధవారం రాత్రి జరిగిన రిసెప్షన్‌కు వచ్చిన వెంకటేశన్ ప్రియురాలితో జంప్ అయ్యాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌తో లగడపాటి ఏకాంత భేటీ... వైకాపాలో చేరేనా?

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి ...

news

లింగభేదం కొంపముంచింది.. దిగజారిన భారత్.. కారణం ఏమిటో తెలుసా?

లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం ...

news

తిరుపతిలో ఖుష్బూ క్యాట్ వాక్

తిరుపతిలో నటి ఖుష్బూ సందడి చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీలో క్యాట్ వాక్ ...

news

ఢిల్లీ గాలిలో విషవాయువులు.. జాగింగ్ చేస్తే అంతేనట... వైద్యుల హెచ్చరిక

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఇక్కడ పరిస్థితి రోజు ...

Widgets Magazine