సంద్రమైన చెన్నై... స్తంభించిన జనజీవనం.. పాఠశాలలు బంద్ (Video)

శుక్రవారం, 3 నవంబరు 2017 (09:35 IST)

chennai rains

తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాలుగో రోజు కూడా విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నై నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది. అలాగే కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వీధులన్నీ జలమయమై పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇదిలావుండగా మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈశాన్య రుతుపవనాలతో పాటు... అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను చెన్నై నగర పాలక సంస్థ వేగవంతం చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి… వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. 

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళతో సోదరుడు వివాహేతర బంధం... సోదరిని నగ్నగా ఊరేగించారు

దాయాది దేశం పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువకుడు మరో ...

news

విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు... బిల్ గేట్స్ వస్తున్నారు...

అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక ...

news

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న కల్నల్‌ను పట్టించాడు...

ఈమధ్య కాలంలో ఆర్మీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల భార్యలకు సంబంధించిన వార్తలు ...

news

ఏపీలో పెరిగిన కిడ్నీ పెన్షన్‌దారులు

అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 ...