శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (10:52 IST)

చెన్నైలో భారీ వర్షాలు.. పిడుగుపాటు: ఐదుగురి మృతి.. అప్రమత్తంగా వుండాలని?

బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాని

బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
భారీ వర్షాలు, పిడుగుపాటుకు ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. దీంతో ముందు జాగ్రత్తగా తమిళనాడు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 
తమిళనాడు, పుదుచ్చేరిలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.