ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (14:00 IST)

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయి గురి జిల్లాలోని దుప్‌గురి నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందగా..మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. బండ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌...నియంత్రణ కోల్పోవడంతో.. ఢీవైడర్‌ను తాకి..అటుగా వస్తున్న రెండు వాహనాలను బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘోరం సంభవించిందని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ రాళ్లు కూడా వాహనాలపై పడ్డాయని చెప్పారు. ట్రక్కుకు ముందు వైపు ఉన్న మరో లారీ కూడా దెబ్బతిందని, మొత్తంగా నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.