మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:01 IST)

వరంగల్‌ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

వరంగల్‌ జిల్లా దామోదర మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని పసరగొండ వద్ద లారీ, కారు ఢకొీన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు మేకల రాకేశ్‌, మేడి చందు, రోహిత్‌, సాబీర్‌, పవన్‌గా పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

పరకాల ఎసిపి శ్రీనివాస్‌ ఘటనా స్థలికి చేరుకొని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.