ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద ఫిలింసిటీ
దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మించాలని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు.
గౌతం బుద్ధనగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, మీరట్‌లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీగా రామోజీ ఫిల్మ్ సిటి ప్రసిద్ధి చెందింది. దాని కంటే అతిపెద్ద ది నిర్మించాలని యోగి నిర్ణయించారు.