శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:13 IST)

కాశ్మీర్‌లో పాకిస్థాన్ స్మగ్లర్లు అరెస్టు - భారీగా డ్రగ్స్ సీజ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ ‌చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం 36 కేజీల వరకు ఉందని భారత భద్రతా అధికారులు వెల్లడించారు. 
 
కాశ్మీర్ సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లు చొరబాటుకు యత్నించగా వారిని భద్రతా బలగాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.